ఐదుగురు పిల్లలని నదిలో వదిలేసిన తల్లి ? ఇలాంటి వారు ఉంటారా?

ఐదుగురు పిల్లలని నదిలో వదిలేసిన తల్లి ? ఇలాంటి వారు ఉంటారా?

0
88

తనకు ఏమైనా తన పిల్లల్ని కాపాడుకోవాలి అని అనుకుంటుంది తల్లి, తను తినకపోయినా పర్వాలేదు తన పిల్లలు తినాలి అని భావిస్తుంది తల్లి, కాని ఇక్కడ ఓ మాతృమూర్తి ఎవరూ చేయని దారుణం చేసింది, ఏకంగా తనపిల్లల్ని తానే చంపేసింది, ఎంత ఇంటిలో గొడవలు ఉన్నా ఇలాంటి దారుణం చేస్తారా అని సమాజం ఆమెని చీదరించుకుంటోంది.

బదోహి ప్రాంతానికి చెందిన భార్య భర్తలు, వీరిద్దరికి చాలా కాలంగా సంసారంలో గొడవలు ఉన్నాయి. ఈ గొడవలు తట్టుకోలేక తన పిల్లలను చంపేయాలి అని భార్య భావించింది, ఆమెకి ఐదుగురు బిడ్డలు వారిని తీసుకుని గంగానది దగ్గరకు వచ్చంది.

ఐదుగురిని గంగలోకి తోసింది, దీంతో దగ్గర్లో మత్యకారులు కాపాడటానికి ప్రయత్నించినా ,పిల్లలు కనిపించలేదు, వెంటనే పోలీసులకు ఈ విషయం చెప్పారు, వారు వెతుకులాట చేస్తున్నారు, ఆమె ఎంత దారుణం చేసిందో తెలిసి ఆ ప్రాంతం అంతా షాక్ అయింది. ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అని ఆ తండ్రి పోలీసులకి తెలిపాడు.