మీరు ఈ ఆహ‌రం తీసుకుంటే ఇమ్యునిటీ ప‌వ‌ర్ బాగా పెరుగుతుంది

మీరు ఈ ఆహ‌రం తీసుకుంటే ఇమ్యునిటీ ప‌వ‌ర్ బాగా పెరుగుతుంది

0
77

శ‌రీరానికి ఎలాంటి వైర‌స్ లు వ్యాధులు రాకూడ‌దు అంటే క‌చ్చితంగా బాడీలో ఇమ్యునిటీ ప‌వ‌ర్ ఉండాలి, అప్పుడు మాత్ర‌మే శ‌రీరం ఎలాంటి వ్యాధి వైర‌స్ వ‌చ్చినా త‌ట్టుకుంటుంది. ఇప్పుడు ఈ క‌రోనా వైర‌స్ కూడా ఇమ్యునిటీ ప‌వ‌ర్ త‌క్కువ ఉన్న వారిపై ఎఫెక్ట్ చూపిస్తోంది. మ‌రి ఏ ఆహ‌రం తీసుకుంటే మంచిది ఈ వైర‌స్ ల‌ను త‌ట్టుకోవ‌డానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం

క‌చ్చితంగా రోజుకి ఒక నిమ్మ‌కాయ ర‌సం అయినా తీసుకోవాలి
గోరు వెచ్చిని నీటితో తీసుకోండి
ప్రతి రోజూ గోరువెచ్చని నీళ్లు తాగాలి.
శ‌రీరానికి నీర‌సం లేకుండా మ‌జ్జిగ తాగాలి
క‌మ‌లం, నారింజ‌, ఇలాంటి సిట్రిస్ ఫ‌లాలు తీసుకోవాలి.

పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా వంటల్లో ఉండేలా చూసుకోవాలి.వీటిని కూర‌ల్లో ఉండేలా చూసుకోండి, శ‌రీరం వేడి ఉన్న వారు చ‌లువ‌కి మ‌జ్జిగ ఎక్కువ తాగండి, కూల్ డ్రింక్ లు ఐస్ క్రీమ్స్ జోలికి ఇప్పుడు వ‌ద్దు.

తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి మిశ్రమంతో కూడిన కషాయం రోజుకు ఒకసారి కానీ రెండు సార్లు కానీ తాగాలి. ఒక గ్లాసు వేడి పాలలో అరస్పూను పసుపు వేసి తాగాలి. , వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ఇది తిరుగులేనిది అని చెప్పాలి. అల్లం రెండు రోజుల‌కి ఒక‌సారి అయినా వాడండి.