సుమారు నెల రోజుల వరకూ లాక్ డౌన్ … ఇక మే 3 వరకూ అందరూ ఇంటికి పరిమితం అవ్వాల్సిందే, ఈ సమయంలో ఆర్టీసీ బస్సులు నడవడం లేదు, అయితే ఆర్టీసీ ఉద్యోగులని కూడా ఉపయోగించుకోవాలి అని కరోనా కట్టడిలో ఆలోచించారు అధికారులు.
గుజరాత్ సూరత్ లోని బర్డోలిలో జీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పోలీసుల విధులను నిర్వహిస్తున్నారు. బార్డోలీ పోలీసులు సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నారు. అందుకే ఆర్టీసీ ఉద్యోగులని కూడా ఉపయోగించుకుంటున్నారు,
సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ విజయ్ రబారీని పోలీసు అధికారులు సంప్రదించారు. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వారికి శిక్షణ ఇచ్చి పోలీసు విధులు చేయిస్తున్నారు, కొన్ని పాయింట్ల దగ్గర సెక్యూరిటీగా ఉంటున్నారు బయటకు ఎవరిని రానివ్వకుండా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.