ట్రంప్ మరో అత్యంత సంచలన నిర్ణయం

ట్రంప్ మరో అత్యంత సంచలన నిర్ణయం

0
97

మొత్తానికి అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ అనుకున్న పనే చేశాడు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారికి ఒక్క డాలర్ కూడా ఇచ్చేది లేదని అన్నారు, అంతేకాదు నిధులు అన్నీ వారికి ఇవ్వకండి అని నిలిపివేయాలి అని ఆర్డర్ పాస్ చేశారు.

ప్రపంచంలో కరోనా వైరస్ ముప్పుపై హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. దీనిపై ముందు నుంచి హెచ్చరికలు చేయలేదని ఆ ఫలితమే ఇప్పుడు ఇలా ప్రపంచం మారింది అని అన్నారు ఆయన.

ఆ సంస్ధకు నిధులు అత్యధికంగా తామే ఇస్తున్నాము అని అమెరికా తెలిపింది, తమకు హక్కు ఉంది అని ట్రంప్ అన్నారు. చైనా సహా ఇతర దేశాల ప్రయాణాలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించడం డబ్ల్యూహెచ్ఓ తీసుకొన్న అత్యంత వినాశకరమైన నిర్ణయమన్నారు. ఆరోజు వాటికి పర్మిషన్ ఇచ్చి ఉంటే అమెరికా ఇలా ఉండేది కాదు అని అక్కడ అధికారులు అంటున్నారు.