మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆచార్య సినిమాని సెట్స్ పై పెట్టారు.. కొరటాల శివ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు, అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది, ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తితో షూటింగ్ ఆగిపోయింది.
ఇక ఈ సినిమా గురించి హీరోయిన్ విషయంలో ఇంకా ఏమీ ఫైనల్ చేయలేదు అంటున్నారు, ముందు మెయిన్ చిరుకి సంబంధించిన షాట్లు షూట్ చేశారట, అయితే హీరోయిన్ షెడ్యూల్స్ ఇంకా ఫైనల్ చేయలేదు అంటున్నారు, అయితే ఇటీవల హీరోయిన్ త్రిష ఈసినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం కాజల్ ని ఫైనల్ చేశారు అని అంటున్నారు. అయితే ఇంకా దీనిపై ప్రకటన రాలేదు, కాని తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది, ఈ సినిమాలో ఇప్పుడు చిరు పక్కన నయనతార నటిస్తారు అని తెలుస్తోంది, ఆమె చిరు పక్కన బాగుంటారు అని పలువురు చిత్ర యూనిట్ భావించారట, అయితే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.. కాని అసలు చిత్ర యూనిట్ మన మెగాస్టార్ మాత్రం ఎవరికి ఒకే చెప్పారు అనేది తెలియదు, చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చే వరకూ ఆగాల్సిందే.