జగపతి బాబు మంచి ఫ్యామిలీ హీరో, కాని ఇప్పుడు ఆయన ప్రతినాయకుడి పాత్రలు ఎక్కువగా చేస్తున్నారు… నిజమే హీరోగా ఉన్న సమయంలో కంటే ఇప్పుడు ఆయనకు మరింత ఫేమ్ వచ్చింది.. అలాగే పలువురు హీరోలు విలన్స్ గా నటించాలి అని అనుకుంటున్నారు..
టాలీవుడ్ లో పెద్ద హీరోలు కూడా తమ ప్రతి నాయకుడి గా హీరోనే కోరుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో గోపి చంద్ విలన్ గా మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయనకు అవకాశం రాబోతోంది అని ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు గోపి చంద్ కోసం చిరంజీవి నేరుగా అడిగారు అని తెలుస్తోంది. అయితే ఆచార్య సినిమా తర్వాత చిరు చేసే సినిమా లూసిఫర్ అని తెలుస్తోంది, ఈ సినిమాలో విలన్ గా గోపి చంద్ ని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మెగాస్టార్ సినిమా పైగా మంచి స్టోరీ కాబట్టి గోపీచంద్ కూడా నటించే అవకాశం ఉంది అంటున్నారు.