విషాదం- కుప్పం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ కన్నుమూత

విషాదం- కుప్పం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ కన్నుమూత

0
102

రాజ‌కీయంగా ఆయ‌న అంద‌రికి సుప‌రి‌చితులు క‌లెక్ట‌ర్ గా గ‌తంలో ఆయ‌న ఎంతో మందికి సాయం చేసిన ఉన్న‌త‌మైన వ్య‌క్తి ..ఆయ‌నే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.చంద్రమౌళి , అలాంటి ఓ మంచి వ్య‌క్తి మ‌ర‌ణం అంద‌రిని విషాదంలో నింపేసింది.

శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. 2019 శాసనసభ ఎన్నికల్లో అనారోగ్యానికి గురై ప్రచారానికి వెళ్లనప్పటికీ ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు, ఆయ‌న‌పై చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో గెలిచారు, ఇక ఆయ‌న అంత్య‌క్రియ‌లు హైద‌రాబాద్ లో జ‌రుగ‌నున్నాయి.కె.చంద్రమౌళి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు .తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా సంతాపం తెలిపారు.

ఆయ‌న 1977లో ఏపీపీఎస్సీ ద్వారా ఏపీలో స‌ర్వీస్ మొద‌లు పెట్టారు, అలా అధికారిగా ప‌లు శాఖల్లో కీల‌క ఉద్యోగాలు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు…1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ క్యాడర్‌కు చెందిన ఆయన విజయనగరం, నెల్లూరు జిల్లాల జాయింట్‌ కలెక్టరుగా, వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఇక ఆయ‌న రిటైర్డ్ అయిన త‌ర్వాత వైసీపీ నుంచి కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో రెండు సార్లు పోటీచేశారు..కుప్పం మండలం పెద్దబంగారునత్తం చంద్రమౌళి కుటుంబం స్వగ్రామం. ఆయ‌న లేరు అనే వార్త‌తో అక్క‌డ వైసీపీ కేడ‌ర్ క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.