మన దేశమేకాదు యావత్ ప్రపంచంలో దాదాపు 45 దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి, ఇలాంటి సమయంలో లాక్ డౌన్ పాటిస్తున్న సమయంలో కేసులు తీవ్రత మరింత పెరుగుతోంది, ఒకవేళ లాక్ డౌన్ లేకపోతే చైనా అమెరికాని దాటి కేసులు మనదేశంలో పెరిగిపోయేవి అంటున్నారు వైద్యులు.
అయితే మన దేశంలో ఇలా ఉంటే స్వీడన్ విధానం వేరుగా ఉంది. స్కూళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. హోటళ్లు తెరిచే ఉన్నాయి. పార్కులకు సకుటుంబంగా వెళ్తూనే ఉన్నారు. బ్యాంకులు కంపెనీలు అన్నీ రన్ అవుతున్నాయి ..జనాలు రోడ్లపై తిరుగుతున్నారు, కాని కేసులు పెరగడం లేదు.
దీనికి కారణం వారు చాలా జాగ్రత్తలు తీసుకుటున్నారు.. కలిసి నడవడం లేదు కౌగిలింతలు షేక్ హ్యాండ్స్ లేవు.. సామాజిక దూరం ప్రతీ చోటా పాటిస్తున్నారు, జ్వరం జలుబు ఉంటే బయటకు రావడం లేదు ఫుల్ క్లీన్ గా ఉంటున్నారు, నీట్ నెస్ అన్నీ చోట్లా కనిపిస్తోంది, ఇక శానిటైజేషన్ 24 గంటలు జరుగుతోంది, పాకెట్ శానిటైజర్లు అందరూ వాడుతున్నారు, ఇలా పలు జాగ్రత్తలతో అక్కడ కేసులు తగ్గుతున్నాయి.
స్వీడన్‌లో . 14,385 కేసులు నమోదు కాగా 1540 మరణాలు సంభవించాయి.