ఒక వైపు కరోనా విజృంబిస్తోంది.. మరో వైపు రాజకీయ నాయకులు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటున్నారు… కన్నా వర్సె స్ వైసీపీ అన్న చందంగామరాయి ఏపీ రాజకీయాలు… ఇటీవలే ఎంపీ విజయసాయిరెడ్డి కన్నా లక్ష్మీ నారాయణ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అమ్ముడు పోయారని విమర్శలు చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి..
దీనిపై కన్నా కౌంటర్ కూడా ఇచ్చారు ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా స్పందించారు… గతంలో బీజేపీ ఆఫర్ కోసం గుండెపోటును తెప్పించుకుని గుంటూరు లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిన కన్నా కూడా నీతులు చెబుతున్నారని మండిపడ్డారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను వేసిని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు… ఇంతకు ఏంటా ప్రశ్నలంటే…
కాణిపాకం వినాయకుడి దగ్గరకు ‘కన్నా’ వచ్చి.. 2018 ఏప్రిల్ 24న తాను గుండెపోటుతోనే ఆసుపత్రిలో చేరాను, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవడానికి తాను రూ.20 కోట్లు ఢిల్లీలో ఒక బ్రోకర్‌కు ఇవ్వలేదని ప్రమాణం చేయాలి..
2019 ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన నిధులను సద్వినియోగం చేశానని ప్రమాణం చేయాలి…
చిన్నస్థాయిలో ఉన్న నేను ఇన్ని వందల కోట్లకు అధిపతి కావడానికి సొంతంగా కష్టపడి సంపాదించానే తప్ప రాజకీయ అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలి…
చంద్రబాబుకు అమ్ముడు పోలేదని ప్రమాణం చేయాలని అన్నారు.