చైనా అత్యంత దారుణంగా మారిపోయింది ఈ వైరస్ తో …. ఇప్పుడు ఇప్పుడే చైనా ఈ వైరస్ ప్రభావంతో కోలుకుంటోంది, కాని మళ్లీ అక్కడ వైరస్ విజృంభిస్తోంది, ఇది ఆందోళన కలిగిస్తోంది, అంతేకాదు అతి పెద్ద సిటీలో మళ్లీ ఇది కోరలు చాచుతోంది, వుహన్ లో ప్రజలు మళ్లీ భయం భయంతో తమ పనులు చేసుకుంటున్నారు.
మరో పెద్ద సిటీ హార్బిన్ని లాక్ డౌన్ చేసింది. కరోనా వైరస్ కారణంగా వూహాన్ ను లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కంట్రోల్ కావడంతో వూహాన్ లో ఇటీవలే దాదాపు 70 రోజుల తర్వాత తిరిగి సాధారణ స్దితికి వచ్చారు, కాని మళ్లీ ఇప్పుడు హార్బిన్ సిటీలో వైరస్ కలకలం స్టార్ట్ అయింది.
చైనాలోని అతి పెద్ద సిటీల్లో హార్బిన్ ఒకటి. అక్కడి కోటి మంది జనాభా నివాసం ఉంటారు. ఇక న్యూయార్క్ నుంచి వచ్చిన విద్యార్దికి వైరస్ సోకింది, అక్కడ నుంచి మరో 70 మందికి ఈ వైరస్ పాకేసింది.. అధికారులు వెంటనే అక్కడ సిటీని లాక్ డౌన్ చేశారు, ముందు ఆమెకి నెగిటీవ్ వచ్చింది, కాని ఇప్పుడు పాజిటీవ్ వచ్చింది, ఇది అక్కడ ప్రభుత్వాన్ని మరింత ఆందోళనలో పడేసింది.