చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్

0
78

కోవిడ్ తీవ్రతను కప్పిపెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కడవల కొద్ది కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదని అన్నారు ఎంపీ విజసాయి రెడ్డి. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటుతిప్పి ఇటుతిప్పి బాబు ఆరోపణను ప్రతి వార్తకు లింకు పెట్టి వదులుతున్నాడని ఆరోపించారు. దాస్తే కనపడకుండా పోవడానికి మీ బినామీ ఆస్తులు, బ్లాక్ మనీ కాదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు…

కోవిడ్ పరీక్షల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. వైరస్ పై విజయం సాధించేందుకు ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో శ్రమిస్తోందని అన్నారు. ఈ యుద్ధంలో ప్రజల సహకారమే కీలకం అని తెలిపారు.. మహమ్మారి అనేక విధాలుగా వ్యాపిస్తుంది. లాక్ డౌన్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ ఉనికిని తుడిచేయాలని అన్నారు..

ట్రూనాట్ కిట్స్ తోనే కరోనా వైరస్ టెస్టులు చేస్తున్న విషయం చంద్రబాబుకు తెలియనట్టుంది. వాటి గురించి కొత్తగా విని ఉంటారు. టెస్టులు మొదలైనప్పటి నుంచి ట్రూనాట్ కిట్లనే వాడుతున్నారు. కరోనా గురించి తన వద్ద సమాచారం ఉందని బిల్డప్ ఇవ్వడానికి ఇలాంటివి పేలుస్తుంటారని ఆరోపించారు