ప‌వ‌న్ సినిమా విడుద‌ల‌కు ఆ మూడు డేట్లు ఆలోచిస్తున్నార‌ట‌

ప‌వ‌న్ సినిమా విడుద‌ల‌కు ఆ మూడు డేట్లు ఆలోచిస్తున్నార‌ట‌

0
96

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు, అయితే ఇప్పుడు ఆయ‌న వ‌కీల్ సాబ్ సినిమా చేస్తున్నారు, ఈ స‌మ‌యంలో ఆయ‌న సినిమా షూటింగ్ మ‌ధ్య‌లో ఉంది, దీని త‌ర్వాత మ‌రో రెండు మూడు సినిమాలు కూడా ఫైన‌ల్ చేశారు, అన్నీ కుదిరి ఉంటే వ‌కీల్ సాబ్ మే నెల‌లో రిలీజ్ అయ్యేది.

అయితే ఇప్పుడు మ‌రో రెండు నెల‌ల వ‌ర‌కూ సినిమా షూటింగుల‌కి అవ‌కాశం ఉండదు అని అంటున్నారు.
దాదాపు ఈ సినిమా షూటింగ్ ల‌పై, నిర్మాతలు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఆలోచించే దాని ప్ర‌కారం , జూన్ లేదా, జూలైలో ప్రారంభం అవుతుంది అంటున్నారు.

అయితే ఇలా సినిమా థియేట‌ర్లు ఓపెన్ చేసినా, జ‌నాలు సినిమా థియేట‌ర్ల‌కు వ‌స్తారా అనే ప్ర‌శ్న వ‌స్తోంది..పైగా ఇది భారీ బ‌డ్జెట సినిమా కాబ‌ట్టి , ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి లేదా రిప‌బ్లిక్ డేకి ప్లాన్ చేస్తారు అని తెలుస్తోంది, ఒక‌వేళ వైర‌స్ తీవ్ర‌త త‌గ్గి జ‌నాలు సినిమాల‌కు బాగా వ‌స్తే, అన్నీ పూర్తి అయితే దీపావ‌ళికి రిలీజ్ చేస్తార‌ట‌. దీనిపై షూటింగ్ పూర్తి అయిన త‌ర్వాత ప‌రిస్దితుల బ‌ట్టీ ప్లాన్ చేస్తున్నార‌ట నిర్మాత‌లు.