దేశంలో ఎక్కడా సెలూన్లు తెరవద్దు అనిచెప్పారు, ఎక్కడ వారు అక్కడ ఉండాలి అని తర్వాత కటింగ్స్ చేయించుకోవాలి అని చెప్పారు, అంతేకాదు ఇంటికి తీసుకువచ్చి వారితో కూడా చేయించుకోవద్దు అంటున్నారు.. ఎందుకు అంటే ఆ సిజర్ నుంచి ఆ షేవింగ్ కిట్స్ నుంచి వైరస్ వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు వైద్యులు.
తాజాగా మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లా బార్గావ్ గ్రామంలో ఓ కటింగ్ షాపుకు వెళ్ళిన ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది ఇప్పుడు మొత్తం వారు అందరూ చికిత్స పొందుతున్నారు. ఓ యువకుడు ముందు బార్బర్ షాపుకు వెళ్లాడు, అతనికి పాజిటీవ్ అని వచ్చింది, అతనితో కలిసి వెళ్లిన ఆరుగురికి కూడా సోకింది.
వెంటనే వీరి కుటుంబాలని అలాగే వీరితో కాంటాక్టులో ఉన్న యువకులని క్వారంటైన్ కి తరలించారు.. ఒకే టవల్, పనిముట్లు వాడటంతోనే కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. కాబట్టి కరోనా తగ్గేంత వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని వారు సూచిస్తున్నారు. ఈ సమయయంలో ఇంట్లో షేవింగ్ చేసుకోవడం ట్రిమ్మర్ వాడటం ఇంట్లో శ్రేయస్కరం అని వైద్యులు చెబుతున్నారు. హెయిర్ కటింగ్ గురించి కొద్ది రోజులు పట్టించుకోకండి అంటున్నారు.