చిరు సినిమాలో మెగా డాటర్ పాత్ర అదేనట…

చిరు సినిమాలో మెగా డాటర్ పాత్ర అదేనట...

0
89

మెగా స్టార్ చిరంజీవి 152 చిత్రం సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దరిదాపు పూర్తి అయింది… లాక్ డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ ను వాయిదా వేశారు… ఈ చిత్రం గురించి కొన్ని రోజులుగా పలు వార్తలు వస్తున్నాయి… ఆచార్యలో నిహారిక కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి…

చరణ్ కు చెల్లి పాత్రలో నిహారిక కనిపించబోతుందట… చరణ్ కు సంబంధించిన స్టోరీని నిహారిక చిరంజీవికి చెబుతుందట… అలాగే చరణ్ చనిపోవడంతో ఆ బాధ్యతలను చిరంజీవి తీసుకుంటాడని టాక్…

చిరంజీవి నిహారిక కాంబో సీన్స్ చాలా ఆసక్తికరం అని చర్చించుకుంటున్నారు… కాగా సైరా చిత్రంలో నటించిన నిహారిక అందులో ప్రాముఖ్యత ఉన్న పాత్రను దక్కించుకోలేకపోయింది… కానీ ఈ సారి ముఖ్యమైన పాత్రలో నటిస్తోందని టాక్…