ఈ వైరస్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది.. ఈ సమయంలో కేసుల సంఖ్య పెరుగుతోంది, ఇప్పటికే 29 వేల పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, అయితే మహారాష్ట్రాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి, ముఖ్యంగా ఇన్ని కేసులు నమోదు అయిన ఆ ప్రాంతంలో, పోలీసులు డాక్టర్లు మీడియా ప్రతినిధులకి పారిశుధ్య కార్మికులకి కూడా వైరస్ సోకుతోంది.
అందుకే అక్కడ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు… 55 సంవత్సరాలు దాటిన పోలీసులు ఫీల్డ్ వర్క్ కి రావక్కర్లేదు అని సెలవులు తీసుకోవచ్చు అని ముంబైలో తెలిపారు …48 గంటల్లోనే ముంబైకి చెందిన ముగ్గురు పోలీసులు కరోనా వైరస్‌తో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సెలవులపై నిర్ణయం తీసుకున్నారు.
ఈ సెలవులను పెయిడ్ లీవ్‌లుగా ప్రకటించారు. ఇక 50 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న వారికి స్టేషన్ డ్యూటీ వేస్తున్నారని తెలుస్తోంది, వీరు తీసుకున్నది మంచి నిర్ణయం అంటున్నారు అందరూ.. అక్కడ ఫీల్డ్ లో ఉంటున్న పోలీసులకు ఈ వైరస్ సోకడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.