బల్వందర్ పూర్ అనే గ్రామంలో ఈ వైరస్ తగ్గాలి అని, దీని తీవ్రత తగ్గితే మొక్కులు ఇస్తాము అని మొక్కుకుంటున్నారు జనం, అయితే అక్కడ గ్రామ దేవత ఆలయంలో మొత్తం వేప ఆకులు కట్టి ఆమెని కొలుస్తున్నారు, కేవలం పదుల సంఖ్యలో మాత్రం వెళ్లి అక్కడ ఆమెని కొలుస్తున్నారు.
అంతేకాదు ఇలా కరోనా తగ్గితే ఆడ మగ పిల్లలు అందరూ ,ఊరిలో ఉన్న ప్రతీ ఒక్కరు కూడా గుండు కొట్టించుకుని తలనీలాలు సమర్పిస్తాం అని చెబుతున్నారు, దీంతో ఏకంగా ఈ గ్రామంలో 2500 మంది గుండు కొట్టించుకునేందుకు మొక్కులకు సిద్దం అయ్యారట.
అయితే అమ్మవారి వల్ల మా గ్రామం బాగుందని ఒక్కరికే ఇక్కడ వైరస్ సోకిందని, అతను 10 రోజులుగా కోలుకుంటున్నాడు అని అన్నారు, ఇక గ్రామంలో మొక్కల గురించి స్దానికంగా పెద్ద చర్చ జరుగుతోంది.
అయితే ఏ విపత్తు వచ్చినా వారు ఇలాగే గ్రామ దేవతని మొక్కుకుంటారట.