రిషి కపూర్ ఇక లేరు ఆయన రియ‌ల్ స్టోరీ

రిషి కపూర్ ఇక లేరు ఆయన రియ‌ల్ స్టోరీ

0
84

బాలీవుడ్ లో మ‌రో విషాదం, రిషి క‌పూర్ ఇక‌లేరు, ఆయ‌న ఆరోగ్యం నిన్న క్షీణించ‌డంతో ఆస్ప‌త్రిలో కుటుంబ స‌భ్యులు చేర్చారు, కాని దురదృష్ట‌వ‌శాత్తు ఆయ‌న చికిత్స పొందుతూ క‌న్నుమూశారు, ఆయ‌న వ‌య‌సు 67 ఏళ్లు, ఇలా అకాల‌మ‌ర‌ణం అంద‌రిని క‌లిచివేసింది బీటౌన్ మూగ‌బోయింది.

రిషికపూర్ మరణించనట్లు ఆయన అన్న రణధీర్ కపూర్ తెలిపారు, ఆయ‌న కొంత‌కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు, అమెరికాలో ఆయ‌న కొంత కాలం చికిత్స తీసుకున్నారు, అమెరికా నుంచి గ‌త ఏడాది చివ‌ర్లో ఆయ‌న ఇండియా వ‌చ్చారు, ఇక ఆయ‌న ప‌లు సినిమాల్లో న‌టించారు నిర్మాత‌గా కూడా చేశారు.

ప్రఖ్యాత సినీ నటుడు రాజ్ కపూర్ రెండవ కుమారుడు రిషి కపూర్. ఆయన అన్న రణధీర్ కపూర్. తమ్ముడు రాజీవ్ కపూర్. రితు నందా, రిమా జైన్ ఆయన సోదరీమణులు. ఇలా 100 ఏళ్ల సినిమా చ‌రిత్ర క‌లిగిన కుటుంబం.1973లో బాబీ సినిమాతో రిషి కపూర్ హీరోగా తన నట జీవితాన్ని ప్రారంభించారు. శ్రీ420, మేరా నామ్ జోకర్ చిత్రాల్లో బాల నటుడిగా కనిపించారు. ఆయ‌న కుమారుడు ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా బాలీవుడ్ లో అగ్ర‌హీరోగా వెలుగొందుతున్నారు.