ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బ్రతికి ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియడం లేదు.. అయితే ఆ దేశం మాత్రం ఆయన బతికే ఉన్నారు అని తెలిపింది, కిమ్ యో జోంగ్, ఈమె కిమ్ సోదరి, తాజాగా అధ్యక్ష రేసులో ఆమె పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది …ఆమె చాలా సీనియర్ గా అక్కడ దేశంలో రాజకీయాలు చూస్తున్నారు..
అయితే ఆమె అధ్యక్ష రేసులో లేరు అని తెలుస్తోంది. ఆమె కాబినెట్లో కీలక పదవిలో ఉంటారు అని అంటున్నారు.. తాజాగా కిమ్ చిన్నాన్న కిమ్ ప్యాంగ్ పేరు తెరపైకి వచ్చింది, ఆయన వయసు 65 సంవత్సరాలు, ఆయన అధ్యక్ష రేసులో ముందు ఉన్నారట, గతంలో ఆయన అధ్యక్షుడిగా కిమ్ తండ్రిపై పోటీ చేశారు కాని ఓటమి పాలయ్యారు..
అయితే ఆయన నాలుగు ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, కాని తాజాగా కిమ్ ఆరోగ్యం పై వార్త రావడంతో ఆయన పేరు మళ్లీ తెరపైకి వచ్చింది, దేశంలో మేధావులు ఆయనకు అవకాశం ఇవ్వచ్చు అని అంటున్నారు, అంతేకాదు ఆయన ఈ పదవికి సరైన వాడు అని అంటున్నారు అందరూ.మరి కిమ్ మళ్లీ రంగంలోకి వస్తే ఇక వీరు ఎవరూ రేసులో ఉండనట్టే.