దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది, అయితే ప్రతీ స్టేట్ లో రేషన్ పేదలకు వైట్ కార్డ్ హోల్డర్ కు అందిస్తున్నారు, ఈ సమయంలో కచ్చితంగా సామాజిక దూరం పాటించాలి అని తెలియచేస్తున్నారు, ఇక ఏపీలో అయితే గ్రామ వాలంటీర్లు ఇంటికి రేషన్ తీసుకువస్తున్నారు, అలాగే రేషన్ కూపన్లు అందచేసి ఏ రోజు రేషన్ కు వెళ్లాలి అనేది తెలియచేస్తున్నారు.
ప్రతీ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్‌తో పాటు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటున్నారు..ఇందులో భాగంగా బయట తిరిగే వారికి మాస్క్ తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించకపోతే పెట్రోల్ పోయకూడదని పెట్రోల్ బంకులకు ఆదేశించింది. అంతేకాదు.. నెలవారిగా ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులను కూడా ఇవ్వకూడదని నిబంధన తీసుకొచ్చింది.
ఇక కచ్చితంగా బయటకు ఎవరు వచ్చినా మాస్క్ ధరించాల్సిందే, ఈ రూల్ గోవాలో తీసుకువచ్చారు. గోవా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయం తెలిపారు, అయితే ఇక్కడే కాదు దేశంలో కూడా మే 3 తర్వాత ఈ రూల్ వస్తుంది అంటున్నారు అందరూ.