రైల్వేశాఖ కొత్త‌గా తిప్పుతున్న రైళ్లు ఇవే వారికి మాత్ర‌మే ?

రైల్వేశాఖ కొత్త‌గా తిప్పుతున్న రైళ్లు ఇవే వారికి మాత్ర‌మే ?

0
81

దేశంలో వ‌ల‌స కార్మికుల‌ను త‌ర‌లించేందు‌కు వారిని స్వ‌గ్రామాల‌కు తీసుకువెళ్లేందుకు, రాష్ట్రాల‌కు అనుమ‌తి ఇచ్చింది కేంద్రం.. ఈ స‌మ‌యంలో రాష్ట్రాలు రైల్వే సౌకర్యం క‌ల్పించాలి అని కేంద్రాన్ని కోరాయి.. దీంతో కేంద్రం రైల్వే శాఖ‌కు అనుమ‌తి ఇచ్చింది, దీంతో వ‌ల‌స కూలీల‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్నారు.

కేవ‌లం వ‌ల‌స కూలీల‌కు మాత్ర‌మే, (సాధార‌ణ ప్ర‌యాణీకుల‌కి మాత్రం కాదు ) మ‌రి ఆ రైళ్లు వివ‌రాలు చూద్దాం.

లింగంప‌ల్లి తెలంగాణ నుంచి రైలు బ‌య‌లు దేరి – హ‌తియా జార్ఖండ్ కు వెళుతుంది
నాసిక్ మ‌హ‌రాష్ట్ర నుంచి – ల‌క్నో ఉత్త‌ర‌ప్ర‌దేశ్
అలూవా కేర‌ళ – భువ‌నేశ్వ‌ర్ ఒడిశా
నాసిక్ – మ‌హ‌రాష్ట్ర – భోపాల్ మ‌ధ్య‌ప్ర‌దేశ్
జైపూర్ రాజ‌స్ధాన్ – పాట్నా బిహ‌ర్
కోటా రాజ‌స్ధాన్ – హ‌తియా జార్ఖండ్ కు

ఇక ఈ రైళ్లు పూర్తిగా శానిటైజ్ చేస్తారు, ఇక్క‌డ కూడా బోగికి 40లేదా 50 మందికి మాత్ర‌మే సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే రైల్వే శాఖ వారికి పూర్తిగా మంచి భోజ‌నం అందించ‌నుంది.