కొత్త సినిమాల విష‌యంలో హీరో హీరోయిన్ల‌కు కొన్ని కండిష‌న్లు

కొత్త సినిమాల విష‌యంలో హీరో హీరోయిన్ల‌కు కొన్ని కండిష‌న్లు

0
106

ఇప్పుడు సినిమా ప‌రిశ్ర‌మ అతి దారుణ‌మైన స్దితిలో ఉంది.. ఓ ప‌క్క‌ సినిమాలు మ‌ధ్య‌లో నిలిచిపోయా‌యి, అయితే వీటి విడుద‌లకు ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. మ‌రో ప‌క్క నిర్మాత‌లు అప్పులు తెచ్చి సినిమాలు చేస్తున్నారు, దీంతో వారికి వడ్డీల భారం భారీగా ప‌డుతుంది, అంతేకాదు కొత్త సినిమాల విష‌యంలో కూడా ఇది మ‌రింత ఎఫెక్ట్ చూపిస్తోంది.

ఈ స‌మ‌యంలో క‌చ్చితంగా హీరోలు హీరోయిన్లు సీనియ‌ర్ న‌టులు క‌చ్చితంగా రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవాల్సిందే అంటున్నారు నిర్మాతలు, ఈ విష‌యంలో నో ఛాన్స్ అంటున్నారు, ఎంత పెద్ద‌ సినిమా అయినా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా క‌చ్చితంగా రెమ్యున‌రేష‌న్ తో కోత‌లు ఉంటాయి అంటున్నారు.

ఎందుకు అంటే సినిమాలు విడుద‌ల అయినా క‌లెక్ష‌న్లు ఎలా ఉంటాయో తెలియ‌దు, మ‌రో ప‌క్క కొత్త సినిమాలు తీసేందుకు కొంద‌రు నిర్మాత‌లు ముందుకు రా‌రు, ధియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రాక‌పోతే ఇక ఈ నిర్ణ‌యం తీసుకుంటారు అని చాలా మంది ఆలోచ‌న చేస్తున్నారు.