తన కూతురు వేరే వ్యక్తిని ప్రేమించడంతో కడుపున పుట్టిన తల్లి అతి కిరాతంగా హత్య చేసింది… ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది… తన కూతురు జన్ ప్రీత్ కౌర్ సమీప గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ప్రేమించింది… ఈ విషయం ఎక్కడ బయటపడితే పరువుపోతుందోనని భయపడి కూతురుని హత్య చేసింది…
ఇందుకు మరిధి, అతని కూతురు సహకరించారు… హత్య చేసిన తర్వాత ఒక కథను క్రియేట్ చేయాలని చూసింది తల్లి.. తన కూతురు కనిపించలేదని పోలీసుకు ఫిర్యాదు చేసింది… తనకు సమీప గ్రామానికి చెందని వ్యక్తి మీద అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది…
ఆ తర్వాత కొన్నిరోజులకు తన కూతురు రైల్వే స్టేషన్ లో దొరికిందని చెప్పింది… ఇక ఆమెపై అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తు చేశారు దీంతో అసలు నిజం బయటపడింది.. కూతురు వేరే వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో ఆమెకు నిద్ర మాత్రలు ఇచ్చి గొంతు నులిమి చంపారని తేలింది… దీంతో పోలీసు వారిపై కేసు నమోదు చేశారు..
—