ఉప్పల్ హెరిటేజ్‌లో నలుగురికి కరోనా వచ్చిందకి వారి వల్ల 25 మంది క్వారంటైన్ కు తరలించారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు… వీరంతా సత్వరం కోలుకోవాలని అన్నారు.. అయితే ఈ వార్త పబ్లిష్ కాకుండా, టెలికాస్ట్ కాకుండా మీడియాను మేనేజ్ చేసిన చంద్రబాబును ఏం చేయాలని అన్నారు.. బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా అని ఎద్దేవా చేశారు..
గతంలో పది ఇళ్ళకో బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావు. జగన్ వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారు. వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోంది. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు…
రెండు నాలుకల్లో ఏది,ఎప్పుడు,ఏలైన్ తీసుకుంటుందో ఊహించడం కష్టం. కష్టజీవులకు ఉపశమనం లేకుండా మద్య నియంత్రణ ఏంటి?షాపులెలా తగ్గిస్తారని నిన్నటికి నిన్న కిందపడి దొర్లాడు.సైకిల్ నేతలను దెబ్బకొట్టడానికే ఇదంతా అన్నాడు. ఇప్పుడు కేంద్రం నిర్ణయానికి రాష్ట్రాన్ని నిందిస్తున్నాడు.మనిషి మారడంతే అని అన్నారు…