లాక్ డౌన్ లో చాలా మంది ఇంటి పట్టున ఉంటున్నారు, ఈ సమయంలో భర్త భార్య మధ్య చిన్న మనస్పర్ధలు వస్తున్నా వారు ఒకరిని ఒకరు పట్టించుకోవడం లేదు, ఈ సమయంలో చాలా మంది భార్యలు భర్తలని పక్కన పెట్టి డేటింగ్ వెబ్ సైట్స్ లో రిజిస్ట్రర్ అవుతున్నారు..ఫేక్ ఫ్రొఫైల్స్ తో దాదాపు 1.20 లక్షల మంది యాడ్ అయ్యారట ఈ 40 రోజుల్లో.
ఇది చాలా డేంజర్ అని అంటున్నారు నిపుణులు, ముఖ్యంగా ఇద్దరి మధ్య సరైన అవగాహన లేకపోవడం ప్రతీ చిన్న విషయానికి గొడవలు పడటం దీనికి ప్రధాన కారణం అని చెబుతున్నారు, చాలా మంది ఇందులో ఉద్యోగం చేస్తున్న మహిళలు ఉన్నారని, ఇందులో 48 వేల మంది సాధారణ గృహిణీలు ఉన్నారు అని అంటున్నారు.
ఇక డేటింగ్ రికార్డ్ ప్రకారం ఇందులో పురుషులు కూడా తమ భార్యల నుంచి వస్తున్న టార్చర్ పడలేక కొత్త సుఖాలు చూసుకుంటున్న వారు ఉన్నారు. ఇది మంచిది కాదని ఇద్దరి మధ్య సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలని, మీ డీటెయిల్స్ అన్నీ ఇలా సైట్లలో బహిరంగం చేసుకోవద్దు అని అంటున్నారు నిపుణులు.