ఆ షాపులో మ‌ద్యం ఎవ‌రూ కొన‌డం లేదు ఎందుకంటే

ఆ షాపులో మ‌ద్యం ఎవ‌రూ కొన‌డం లేదు ఎందుకంటే

0
120

అస‌లు దేశంలో మ‌ద్యం షాపులు తీయ‌గానే పెద్ద ఎత్తు‌న మ‌ద్యం కొనేందుకు మందు బాబులు పెద్ద ఎత్తున క్యూ క‌ట్టారు..కాని ఏపీలో అనంత జిల్లాలో క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులో ఉన్న ప్రాంతంలో ఉన్న వైన్ షాపుకి మాత్రం జ‌నాలు రావ‌డం లేదు.. ఏదో చిన్న క్వార్ట‌ర్ బాటిల్ గంట‌‌కు ఒక‌రు వ‌చ్చి కొనుకుంటున్న ప‌రిస్దితి.. అస‌లు ఆషాపుకి జ‌నాలు రాక‌పోవ‌డానికి కార‌ణం ఉంది.

ఇక్క‌డ మ‌ద్యం ధ‌ర‌లు పెరిగాయి, అయితే ఏపీలో కొత్త ధ‌ర‌ల‌తో చాలా రేట్లు పెరిగాయి, అందుకే క‌ర్ణాట‌క‌ స‌రిహ‌ద్దు ఉన్నందుకు ఇర‌వై కిలోమీట‌ర్లు వెళ్లి అక్కడ‌ మ‌ద్యం కొనుక్కొని తెచ్చుకుంటున్నారు, అక్క‌డ నుంచి ఇక్క‌డ‌కు పెట్రోల్ ఖ‌ర్చు పోయినా ఇంకా డ‌బ్బులు మిగులుతున్నాయ‌ట‌.

ఇక్క‌డ బాటిల్ 180 అయితే క‌ర్ణాట‌క ద‌గ్గ‌ర బాటిల్ 80, అందుకే అక్క‌డ తాగుతున్నాం అంటున్నారు, మొత్తానికి మందు బాబులు ఇలా తెలివిగా అక్క‌డ తెచ్చుకోవ‌డంతో ఈ షాపులో అమ్మ‌కాలు లేక ఖాళీగా ఉంటున్నాడ‌ట‌..అనంతపురం జిల్లాలోని మడకశిరలో ఈ చిత్రమైన పరిస్థితి ఉంది.