జ‌య‌లలిత నివాసాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా

జ‌య‌లలిత నివాసాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా

0
89

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అంటే అభిమానించే వారు కోట్ల మంది ఉన్నారు, ఆమె మాటే అక్క‌డ శాస‌నం, కాని ఆమె మ‌ర‌ణం త‌ర్వాత అక్క‌డ రాజ‌కీయాలు పూర్తిగా మారిపోయాయి, ఇక ఆమె ఆస్తుల గురించి కూడా ప‌లు వార్త‌లు వినిపించాయి. తాజాగా జ‌య ఇంటి గురించి మ‌రో కొత్త వార్త వినిపిస్తోంది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత నివాసం వేద నిలయంను సేకరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసింది. ఆమె నివాసానికి గ‌తంలో నేత‌లు పెద్ద ఎత్తున క్యూ క‌ట్టేవారు కాని ఆమె మ‌ర‌ణం త‌ర్వాత ఆ ఇంటి గురించి ఎవ‌రికి చెందుతుంది అని అనేక మంది చ‌ర్చించుకున్నారు.

కాని స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పొయెస్ గార్డెన్‌లోని ఆమె నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చేందుకు నిర్ణయించింది. సేకరణ అధికారి , అలాగే రెవిన్యూ డివిజనల్ అధికారి సిఫారసు మేరకు త‌మిళ‌నాడు ప్రభుత్వం చెన్నై కలెక్టర్ ఈ భూమి, భవనాలు ప్రజా ప్రయోజనాల కోసం అవసరమని సంతృప్తి చెందినట్లు ప్రభుత్వ ప్రకటన చేసింది.