ఇప్పుడు దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరచుకున్నాయి, దీంతో మందు బాబులు ఇంట్లో దాచుకున్న సొమ్మును కూడా తీసుకువెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు, ఈ కరోనాతో 40 రోజులుగా మద్యానికి దూరంగా ఉన్న మద్యం ప్రియులు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నారు.
దీనిపై మత ప్రభోదకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైరయ్యాడు. కచ్చితంగా లిక్కర్ షాపుల దగ్గర క్యూ పద్దతి పాటించి ఆరడుగులు భౌతిక దూరం పాటించాలి అని తెలిపారు కేఏ పాల్.. లేకపోతే మరింత నష్టం జరుగుతుందని తెలిపారు.
జనాలు క్యూ లైన్లలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా నిలబడితే కోవిడ్-19 వచ్చే ప్రమాదం ఉందన్నారు పాల్. ఇలా తాగిన వారికి వ్యాధి వస్తే అది కుటుంబ సభ్యులకి కూడా వస్తుంది అన్నారు, తాగేవాళ్లకు దాతలు ఉచితంగా అందజేసి ఆహారాన్ని నిలిపివేయాలని కోరారు. ఫ్రీ రేషన్ ఆపివేసి… మద్యం తాగినవాళ్ల చేతులకు చుక్కలు పెట్టాలన్నారు. తాగొచ్చే భర్తలకు ఆడవాళ్లు బుద్ది చెప్పాలని.. తిండి పెటవద్దని, అవసరమైతే వారిని పస్తులు పెట్టి వారిని కొట్టండని కూడా మహిళలకు చెప్పారు ఆయన