విద్యార్దులకి ఇప్పుడు చాలా కష్టమైన స్దితి, ఓ పక్క పరీక్షల కాలం, కాని లాక్ డౌన్ తో ఎక్కడా ఎవరూ స్కూల్స్ కాలేజీకి వెళ్లలేని స్దితి, అయితే పరీక్షల సమయంలో లాక్ డౌన్ తో పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి, అయితే ఓ మాస్టారు ఆన్ లైన్ లో క్లాసులు చెబుతున్నాడు, కాని ఓ విధ్యార్దినితో ఈ క్లాస్ పూర్తి అయిన తర్వాత డౌట్ ఉంటే పర్సనల్ నెంబర్ కు కాల్ చేయాలి అని చెప్పాడు.
ఈ సమయంలో ఆ విధ్యార్దిని మాస్టార్ నెంబర్ కు మెసేజ్ చేసింది, ఈ సమయంలో క్లాస్ చెబుతూ డౌట్ తీర్చుతూ, కొన్ని నీచపు కామెంట్లు చేశాడు, దీంతో ఆమె రెండు మూడు సార్లు వారించినా మాస్టార్ వినలేదు, దీంతో ఆ ఫోన్ తన తండ్రికి వినిపించేలా స్పీకర్ పెట్టింది.
వెంటనే మాస్టార్ బుద్ది తెలుసుకుని నేరుగా అతనిపై స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు, దీంతో ఒక్క రోజే పాఠాలు చెప్పి ఇప్పుడు జైలు పాలయ్యాడు ఈ మాస్టారు, ఇలాంటి వ్యక్తిని స్కూల్లో కూడా తీసివేసింది ఆ యాజమాన్యం.