మహేశ్ బాబు అభిమానుల‌కి రెండు గుడ్ న్యూస్ లు

మహేశ్ బాబు అభిమానుల‌కి రెండు గుడ్ న్యూస్ లు

0
128

ప్రిన్స్ మ‌హేష్ బాబు తాజాగా త‌న 27 వ సినిమా రెడీ చేసుకుంటున్నారు, ఇప్ప‌టికే ఎవ‌రితో ఆయ‌న సినిమా చేస్తారు అని అనేక డౌట్లు ఉండేవి, అయితే స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత త‌దుప‌రి సినిమాపై ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు, కాని ఆయ‌న తాజాగా గీత‌గోవిందం చిత్రంలో సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్న హిట్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ తో సినిమా చేస్తున్నారు.

ఓ ప్రేమ‌క‌ధను మ‌హేష్ తో ఆయ‌న తెర‌కెక్కిస్తారు అని తెలుస్తోంది.ఇక‌ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు (మే 31)న ఈ సినిమాను లాంచ్ చేయాలని భావించారు. అయితే తాజాగా ఆరోజు ప్రిన్స్ ఫ‌స్ట్ లుక్ అలాగే టైటిల్ కూడా ప్ర‌క‌టిస్తారు అని వార్త‌లు వ‌స్తున్నాయి, దీనిపై ఇంకా ప్ర‌క‌ట‌న లేదు కాని స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.

ఇటు మహేష్ ఫ్యాన్స్ కూడా త‌మ అభిమాన హీరో సినిమా గురించి ఎలాంటి వార్త వ‌స్తుందా అని ఎదురుచూస్తున్నారు, ఇక ఇందులో మ‌హేష్ సూప‌ర్ లుక్ లో క‌నిపిస్తార‌ని ప‌ర‌శురామ్ క‌థ చాలా బాగా రెడీ చేశారు అని అంటున్నారు, ఈ సినిమాలో కథానాయిక అంటూ ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఆ కథానాయికల్లో ఒకరిని త్వరలోనే ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు.