ఏపీలో పలు సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి..తాజాగా పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు, సెప్టెంబరు 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని, మొబైల్ వాహనాల ద్వారా లబ్దిదారుల ఇంటివద్దకే డోర్ డెలివరీ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకి తెలియచేశారు
సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలోనే రేషన్ సరుకులు ఇంటికి డోర్ డెలివరీ చేస్తాం అన్నారు, ఇప్పుడు అదే చేస్తున్నారు, నాణ్యమైన బియ్యం అందించనున్నారు, ఇక ఎవరూ రేషన్ షాపుకి వెళ్లక్కర్లేదు, ఇప్పుడు పించన్లు ఎలా ఇంటికి వస్తున్నాయో అలాగే రేషన్ కూడా అందించనున్నారు.
గ్రామసచివాలయాల్లో 13,370 మొబైల్ యూనిట్లు ఉన్నాయని, మొబైల్ యూనిట్ లోనే ఎలక్ట్రానిక్ కాటా ఉంటుందని తెలిపారు. లబ్ధిదారుల ముందే బస్తా సీల్ తీసి కోటా బియ్యం అందిస్తామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా సంచిలు కూడా తయారుచేయిస్తున్నారు. అంతేకాకుండా మరో రెండు నిత్యవసర సరుకులు కూడా ఇచ్చే ఆలోచనలో ఉందట సర్కార్.