విశాల్ గుప్త తన కూతురికి ధనికుల సంబంధం చూశాడు దీనికి కారణం ఉంది, అమ్మాయి కాలేజీకి ఎంటర్ అయింది ఇక 18 ఏళ్లు మొన్న నిండాయి, అయితే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంది అని తెలిసి వెంటనే ఆమెకి మరో వ్యాపారి కుమారుడికి ఇచ్చి వివాహం చేసేందుకు ఈ లాక్ డౌన్ వేళ సిద్దం అయ్యాడు, అంతేకాదు ఇంటిలో కేవలం 20 మంది మధ్య వివాహానికి ఏర్పాట్లు చేశారు.
ఉదయం 9.35 కి ముహూర్తం పెట్టారు, ఈ సమయంలో పోలీసులు 8.30 కి ఎంటర్ అయ్యారు, అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని ప్రశ్నించారు, కాని తండ్రి మాత్రం ఇష్టమే అని చెప్పాడు, ఆమె మాత్రం ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని చెప్పింది, అయితే పోలీసులకి ఆమె ప్రియుడు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు.
అంతేకాదు పెళ్లి కుమారుడికి వయసు 26 అని చెప్పారు కాని పూర్తి ఆధారాలు అతని డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ అన్నీ చూస్తే 36 ఏళ్లు అని ఉన్నాయి, చివరకు పోలీసులు ఆమె తండ్రిని అరెస్ట్ చేశారు, ఒకవేళ ఈ వివాహం అయినా ఆమె రాత్రి ఆత్మహత్య చేసుకుందాం అని భావించిందట, ఈ విషయం పోలీసులకు ఆమె నేరుగా చెప్పింది, దీంతో పెళ్లి మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు అబ్బాయి తరపు వారు.