పాఠాలు నేర్ప‌మంటే గ‌ర్భ‌వ‌తిని చేశాడు చివ‌రకు ఏమైందంటే

పాఠాలు నేర్ప‌మంటే గ‌ర్భ‌వ‌తిని చేశాడు చివ‌రకు ఏమైందంటే

0
153

కొంద‌రు గురువులు త‌మ వృత్తికే మాయ‌ని మ‌చ్చ‌గా మారుతున్నారు… స్టూడెంట్స్ ని ప్ర‌యోజ‌కులు చేయాల్సిన ఈ గురువులు, కొంద‌రు మూర్ఖులుగా కామాందులుగా మారి అమ్మాయిల జీవితాల‌ని నాశ‌నం చేస్తున్నారు.. మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వంచించాడు ఓ టీచ‌ర్, అంతేకాదు ఆమెని లైంగికంగా టార్చ‌ర్ పెడుతున్నాడు.

ఆమెను శారీరకంగా వాడుకుని ఇప్పుడు గర్భవతిని చేశాడు. ఈ ఘటన జార్ఖండ్ లో కలకలం రేపుతోంది. రాంచీలో ఈ దారుణం జ‌రిగింది, 10 వ త‌ర‌గ‌తి చ‌దివే ఓ అమ్మాయిల‌ని అక్క‌డ ప‌నిచేస్తున్న టీచ‌ర్ ఆమెకి మాయ మాట‌లు చెప్పి లొంగ‌దీసుకున్నాడు.

బాలికను మాయమాటలతో ప్రేమించానంటూ నమ్మించాడు. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారాలు జరిగాయి
ఇక ఇంట్లో నుంచి ఆమె బంగారం న‌గ‌దు తీసుకుని ఆరు నెల‌ల క్రితం పారిపోయింది. అయితే ఆమెని ఓ గ‌ది అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు,

అక్క‌డే కొన్ని నెల‌లుగా ఉంటున్నారు.. ఈ విష‌యం ఎవ‌రికి తెలియ‌లేదు, ఆమెని మాస్టార్ తీసుకువెళ్లాడు అని త‌ల్లిదండ్రులు తెలుసుకోలేక‌పోయా‌రు.. గ‌త వారం ఆమె గ‌ర్భ‌వ‌తి అని తెలిసి ఆమెని అక్క‌డ రూమ్ లో ఉంచి పారిపోయాడు, దీంతో ఓన‌ర్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు, వెంట‌నే పోలీసులు ఆమెని త‌ల్లిదండ్రుల‌కి అప్ప‌గించి అత‌నిపై కేసు న‌మోదు చేశారు.