ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఈ ప‌ది జాగ్ర‌త్త‌లు మీకే

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఈ ప‌ది జాగ్ర‌త్త‌లు మీకే

0
92

మ‌న దేశంలో అతి పెద్ద బ్యాంకు ఎస్ బీ ఐ అనేది తెలిసిందే, అయితే ఎస్ బీ ఐ బ్యాంకుకి దాదాపు 44 కోట్లమంది క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు, అందుకే జాగ్ర‌త్త‌లు కూడా చెబుతూ ఉంటుంది బ్యాంకు, ఇక చాలా వ‌ర‌కూ ఇప్పుడు ఆన్ లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు అన్నీ జ‌రుగుతున్నాయి, ఇక డ‌బ్బుల కోసం చాలా వ‌ర‌కూ ఏటీఎం సెంట‌ర్ కే వెళుతున్నారు.

ఏటీఎం కేంద్రంగా మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కస్టమర్లను ఎస్‌బీఐ పదేపదే అప్రమత్తం చేస్తోంది. ఈ జాగ్రత్త‌లు మీకోసం, మీరు ఎట్టి ప‌రిస్దితుల్లో మీ ఏటీఎం పిన్ ఎవ‌రికి చెప్ప‌కండి, అలాగే మీ పిన్ నెంబ‌ర్ మీ ఆధార్ రేష‌న్ నెంబ‌ర్ మొబైల్ నెంబ‌ర్ల చివ‌రి నెంబ‌ర్లు పెట్టుకోకండి, మీ డేట్ ఆఫ్ బ‌ర్త్ గా కూడా నెంబ‌ర్ పెట్ట‌కండి.

ఇక పిన్ నెంబ‌ర్ కార్డు ద‌గ్గ‌ర ప‌ర‌సులో ఎక్క‌డా రాసి పెట్ట‌కండి , పిన్ ఏటీఎంలో ఎంట‌ర్ చేసే స‌మ‌యంలో ఎవ‌రికి క‌నిపించ‌కుండా చెయ్యి అడ్డు పెట్టండి. మీరు న‌గ‌దు తీసిన త‌ర్వాత ట్రాన్ష‌క్ష‌న్ బిల్లులు తీసుకెళ్లండి, ఎస్‌బీఐ మిస్డ్ కాల్ ఆప్షన్ ద్వారా మీ ట్రాన్సాక్షన్ వివరాలు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. డ‌బ్బులు డ్రా చేసే స‌మ‌యంలో మీరు మాత్ర‌మే ఉండండి, ఎవ‌రిని రానివ్వ‌కండి.