దేశ వ్యాప్తంగా 50 రోజులుగా లాక్ డౌన్ అమలు అవుతోంది, ఈ సమయంలో పాక్షికంగా కొన్ని సడలింపులు ఇస్తోంది కేంద్రం, ఈ సమయంలో రెడ్ కంటైన్మెంట్ ఆరెంజ్ జోన్లలో మినహా, గ్రీన్ జోన్ లో ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు అవకాశం కల్పించారు, అది కూడా కేసులు ప్రభావం లేని చోట తిప్పే అవకాశం కల్పించారు.
ఇక చాలా రాష్ట్రాల్లో గ్రీన్ జోన్లో బస్సులు నడిపేందుకు సిద్దం అవుతున్నారు, తాజాగా సౌత్ స్టేట్ లో కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీని కొన్ని చోట్ల ప్రారంభించింది.ఉడిపి జిల్లా గ్రీన్ జోన్‌గా వర్గీకరించడంతో అక్కడ పాక్షికంగా ఆర్‌టీస్ బస్సు సేవలు ప్రారంభిస్తామని బుధవారం తెలిపింది.
అయితే కేవలం బస్సుల్లో 50 శాతం సీట్లు మాత్రమే నిండే విధంగా ప్రయాణికుల్ని అనుమతించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. అలాగే బస్సుల్లో ఎవరూ నించుని ప్రయాణం చేయకూడదు ఎక్కువ స్టాపులు కూడా ఉండవు అని తెలిపారు, ఉడిపి నుంచి కుండపుర, హెబ్రీ, కర్కల, కోప్ మల్లూరు, బిండూర్, మణిపాల్, బార్కూర్, సిద్దపుర, అలివూర్, మాల్పే, హూడె, బ్రహ్మవర్ ప్రాంతాలకు మాత్రమే ఆర్టీసే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ కేసులు తీవ్రత తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.