దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది, ఈ సమయంలో ప్రజారవాణా విషయంలో ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, ముఖ్యంగా రైల్వే విమానాలపై ఇంకా నిర్ణయం తీసుకులేదు.. ఇక ఆర్టీసీ బస్సుల విషయంలో రాష్ట్రాలకే అవకాశం కల్పించింది కేంద్రం , గ్రీన్ జోన్ లో తిప్పుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఒకే చేసినా మరికొన్ని మాత్రం వైరస్ ఇబ్బంది ఉండటంతో నిలిపివేశారు.
ఇక ఆర్టీసీ అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే నెలాఖరు వరకు కొందరు బస్సులు నడపకూడదని నిర్ణయించారు. ఈ మేరకు రవాణా శాఖకు దరఖాస్తు చేసుకుని పన్ను మినహాయింపు పొందాయి ఆ ట్రావెల్స్.
దీంతో ఇక జూన్ నెల వరకూ ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్లపైకి వచ్చే ఛాన్స్ లేదు అని తెలుస్తోంది, దాదాపు 800 బస్సులు ఉన్నాయి అని తెలుస్తోంది, అయితే వీటిలో దాదాపు 400 బస్సుల యాజమాన్యాలు బస్సులు నడపబోమని తాజాగా దరఖాస్తు చేసుకున్నాయి. రవాణా వాహనాలను మూడు నెలలపాటు నడపకూడదని భావిస్తే త్రైమాసిక పన్ను నుంచి వాటికి ఉపశమనం లభిస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాయి.