ప‌వ‌న్ హ‌రీష్ సినిమాలో హీరోయిన్ ఆమెనా

ప‌వ‌న్ హ‌రీష్ సినిమాలో హీరోయిన్ ఆమెనా

0
108

గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా టాలీవుడ్ లో ఎంత హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరియ‌ర్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది, అయితే టాలీవుడ్ లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది, ఇక ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కు కూడా సూప‌ర్ హిట్ ఆయ‌న ఖాతాలో వేసింది.

ఇక ఈ కాంబో మ‌రోసారి రాబోతోంది, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఇందులో హీరోయిన్ గా ఎవ‌రు రాబోతున్నారు అనేదానిపై వార్త‌లు వినిపిస్తున్నాయి, ఈసారి కొత్త భామ‌ని తీసుకోవాలి అని చూస్తున్నార‌ట‌.

మలయాళ భామ మానసా రాధాకృష్ణన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. అందంగా, క్యూట్‌గా ఉండే మానస ఇప్పటివరకు సాంప్రదాయ పాత్రల్లోనే నటించింది. ఇక హ‌రీష్ ప‌వ‌న్ సినిమాలో ఆమె అయితే ప‌వ‌న్ కు జోడిగా బాగుంటుంది అని భావిస్తున్నారు, అందుకే ఆమె పేరు తెర‌పైకి వ‌చ్చింది.