విపరితంగా తాగుడుకు అలవాటు పడిన భర్త… తన భార్య దగ్గర ఎలాగైనా డబ్బులు తీసుకోవాలని భావించి కీచకుడిగా మారాడు.. చివరకు కటకటాలపాలు అయ్యాడు… ఈ సంఘటన నోయిడాలో జరిగింది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. భర్త తాగుబోతు పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు… భార్య రోజు ఇచ్చిన డబ్బులతో తాగేవాడు…
ఇక కొన్ని రోజుల తర్వాత భార్య భర్తకు డబ్బులు ఇవ్వడం మానేసింది… దీంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయాలని భావించాడు… భార్యకు తెలియకుండా ఆమె బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు ఆతర్వాత వేరే నంబర్ నుంచి ఆమె మొబైల్ నంబర్ కు ఆ వీడియోలను పంపాడు…
తనకు డబ్బులు ఇవ్వాలని లేదంటే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెధిరించాడు దీంతో ఆమె డబ్బులు ఇచ్చింది… ఇలా ప్రతీ సారి బెధిరిస్తుండటంతో ఆమె తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది… పోలీసు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా వీడియోలు పంపింది భర్తేనని తెలిపారు… దీంతో ఆమె పోలీస్ స్టేషన్ ముందే ఆవేదన వ్యక్తం చేసింది…