నితిన్ పెళ్లికి కొత్త ముహూర్తం పెట్టిన కుటుంబ సభ్యులు

నితిన్ పెళ్లికి కొత్త ముహూర్తం పెట్టిన కుటుంబ సభ్యులు

0
102

ఈ లాక్ డౌన్ వేళ దేశంలో చాలా మంది ప్ర‌ముఖులు, సినిమా తార‌లు, బిజినెస్ టైకూన్స్ వివాహాలు వాయిదా ప‌డ్డాయి, మ‌రో మంచి మూహూర్తం చూసుకుని కొంద‌రు పెళ్లి వాయిదా వేసుకుంటున్నారు, మ‌రికొంద‌రు ఈ ముహూర్తంలోనే వివాహం చేసుకుంటున్నారు, కేవ‌లం ఇర‌వై లేదా 30 మంది కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వివాహం జ‌రిపిస్తున్నారు.

తాజాగా హీరో నిఖిల్ వివాహం కూడా ఇలాగే అయింది, అయితే ఇక నితిన్ వివాహం కూడా ఈ స‌మ‌యంలోనే ఉండాల్సి ఉంది, కాని తాజాగా ఈ వివాహం కూడా డేట్ మార్చుకున్నారు,
దుబాయ్‌లో ఏప్రిల్ 16నే ఆయన పెళ్లి చేయాలని కుటుంబ స‌భ్యులు అనుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

ఇక ఆయ‌న వివాహం ఈ ఏడాది డిసెంబ‌రులో చేయాలి అని కుటుంబ స‌భ్యులు భావిస్తున్నార‌ట‌, ఇప్పుడు వ‌చ్చే నెల వ‌ర‌కూ వివాహాలు చేసి‌నా ఈ వైర‌స్ భ‌యం ఉంది.. అందుకే మ‌రో ఆరు నెల‌లు వెన‌క్కి వెళ్లారు అని తెలుస్తోంది… తమ ఫాంహౌజ్‌లోనే నితిన్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారట‌, డేట్ మాత్రం త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.