ఫ్లాఫ్ న్యూస్ – రైలు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇది తప్పనిసరి సరికొత్త రూల్

ఫ్లాఫ్ న్యూస్ - రైలు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇది తప్పనిసరి సరికొత్త రూల్

0
86

కేంద్రం ఇప్పటికే ప్రజారవాణా విషయంలో చాలా కీలకమైన విషయాలు తెలిపింది.. బస్సులు గ్రీన్ ఆరెంజ్ జోన్లలో మాత్రమే తిరగడానికి అవకాశం ఇచ్చారు, ఇక స్టేట్స్ అవి చూసుకోవాలి, మెట్రోరైల్స్ నెలాఖరు వరకూ తిరిగే ఛాన్స్ లేదు, ప్రైవేట్ క్యాబ్స్ విషయంలో కొన్ని సడలింపులు ఇప్పటికే ఇచ్చారు, ఇద్దరితోనే ప్రయాణం చేయాలి.

అయితే రైలు ప్రయాణాల విషయంలో మాత్రం ఈనెలాఖరున కేంద్రం లాక్ డౌన్ పై తీసుకునే నిర్ణయం ప్రకారం ఆధారపడి ఉంటుంది, విమానాలు రైలు ప్రయాణాలపై కేంద్రం ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం లేదు, ఇక ఇప్పటికే శ్రామిక్ రైళ్లు నడుపుతోంది కేంద్రం, త్వరలో వీటిని పెంచే ఆలోచనలో ఉందట, ఇకపై ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే కచ్చితంగా ఈ రూల్ తెలుసుకోవాలి అంటోంది రైల్వే శాఖ.

కొత్తగా 15 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. అయితే, ఇక్కడే రైల్వే ప్రయాణికులకు ఐఆర్సిటిసి కొత్త రూల్స్ ప్రకటించింది. ఐఆర్సిటిసి టికెట్ బుకింగ్లో ఇప్పుడు కొత్త విధానం తీసుకొచ్చింది.

రైల్వే ప్రయాణీకులు ఎవరైనా సరే … మీరు ఈ స్పెషల్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే.. ఏ రాష్ట్రాలకు వెళ్తారో అక్కడి పరిస్థితులను బట్టి ఆ రాష్ట్రాలు విధించే క్వారంటైన్ నిబంధనలను అంగీకరించాలి అని చెబుతున్నారు అధికారులు. దీనిప్రకారం టికెట్ బుక్ చేసుకునే సమయంలో దానికి టిక్ చేస్తే కచ్చితంగా మీరు అంగీకారం తెలిపినట్టే, కచ్చితంగా మీరు దిగిన తర్వాత అక్కడ పోలీసులు వైద్యులకి సహకరించాలి, క్వారంటైన్ అంగీకారం తెలపాల్సిందే.. తాజాగా టికెట్ రిజర్వేషన్లలో ఐఆర్సిటిసి వెబ్ సైట్లో ఈ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఇది సరికొత్త రూల్.