ఈ వైరస్ ఎవరికి అయినా రావచ్చు, అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు వైద్యులు, ఇక బడా వ్యాపారులు, సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు కూడా నిత్యం బయట నుంచి ఇంటికి వచ్చి పనిచేసే వారు ఉంటే వారిని ఇంటికి పంపించేసి, కేవలం ఇంటిలో ఉండే వారితోనే పనులు చేయించుకుంటున్నారు, అంతా కరోనా భయంతో..
అయితే ఇలాంటి చిక్కు వచ్చింది బోనీ కపూర్ ఇంట్లో….బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. తన ఇంట్లో పని చేసే చరణ్ సాహో కు పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన ఆయన ఇంటిలో అందరికి పరీక్షలు నిర్వహించారు.
అదృష్టం వారికి ఎవరికి లక్షణాలు లేవు వైరస్ లేదు అని తేలింది, అయితే కొద్ది రోజులు అందరూ ఇంటిలోనే ఉండాలని చెప్పారు వైద్యులు, ఇప్పుడు ఇది బీ టౌన్ లో పెద్ద చర్చకు కారణం అయింది.
చరణ్ సోహో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. అతను త్వరలో కోలుకుని మా ఇంటికి వస్తాడు అని ఆశాభావం వ్యక్తం చేశారు బోనీ కపూర్.