మౌనిక ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంటిలోనే ఉంటోంది, అమ్మ నాన్నకు సాయం చేస్తోంది, ఆమె బావ యుగందర్ బెంగళూరులో ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అయితే మౌనిక ఒక్క కూతురు కావడం పది ఎకరాల పొలం ఉండటంతో బయట సంబంధం ఎందుకు అని, సొంత అక్క కొడుకు అయిన యుగంధర్ కు ఇచ్చి వివాహం చేయాలి అని అనుకున్నారు ఆమె పేరెంట్స్.
అయితే యుగంధర్ మాత్రం సిటీలో ఉండి అక్కడ ఓ అమ్మాయిని ప్రేమించాడు, ఆమెతో వివాహానికి ఇంట్లో వారు నో చెప్పారు… కారణం ఆమె వేరే క్యాస్ట్ అలాగే పూర్ ఫ్యామిలీ, దీంతో యుగంధర్ ఇక చేసేది లేక మౌనికతో వివాహానికి ఒపుకున్నాడు, అయితే బెంగళూరులో ఉన్న యువతి మాత్రం, యుగంధర్ తనని మోసం చేసి ఈ సమయంలో పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలుసుకుంది.
యుగంధర్ స్నేహితుల ద్వారా మౌనిక ఫోన్ నెంబర్ తీసుకుంది.. అతనికి వారిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలుచ చాటింగ్ డీటెయిల్స్ పంపింది, దీంతో ఇంట్లో 20 మంది కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేద్దాము అనుకున్న తల్లిదండ్రులకి నేను బావని పెళ్లి చేసుకోను అని, జరిగిన విషయం చెప్పింది, దీంతో ఆ పెళ్లి క్యాన్సిల్ చేశారు, ఈ కరోనా సమయంలో ఇంట్లో సభ్యుల మధ్య పెళ్లి చేద్దాం అనుకున్నారు దీంతో పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయిందట.