లాక్ డౌన్ వేళ చాలా సింపుల్ గా వివాహాలు చేసుకుంటున్నారు, ఇక ఫంక్షన్ హల్ ఎక్కడా ఓపెన్ చేయకూడదు, పెద్ద పెద్ద దేవస్ధానాలు కూడా తెరవకూడదు.. ఈ సమయంలో చాలా వరకూ పెళ్లిళ్లు ఇంటి దగ్గర కేవలం 10 లేదా 20 మంది మధ్య సాధాసీదాగా జరుగుతున్నాయి.
అయితే రంజిత్ అనే యువకుడు తను ప్రేమించిన అమ్మాయికి వివాహం చేస్తున్నారు అని తెలిసి తట్టుకోలేకపోయాడు, ఆమెతో గత మూడు నెలల నుంచి మాట్లాడటం లేదు, ఇక ఆమెకి వేరే డబ్బున్న వారి సంబంధం చూశారు పేరెంట్స్, ఆమె ప్రేమని పెద్దలు అంగీకరించలేదు.
అయితే రంజిత్ మాత్రం సుగుణకు సంబంధించినవి తనతో సీక్రెట్ గా ఛాటింగ్ చేసినవి, తను ఆమె కలిసి దిగిన పిక్స్ ఆ పెళ్లి కొడుక్కి పంపించాడు, దీంతో మధ్యాహ్నం పెళ్లి అనగా ఈ విషయం పెళ్లి కుమారుడికి తెలిసి ఆమెని వివాహం చేసుకోను అని చెప్పాడు, దీంతో అమ్మాయి తల్లిదండ్రులు రంజిత్ పై కేసు నమోదు చేశారు, ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.