ఇప్పటికే లాక్ డౌన్ వేళ ఆర్దిక వ్యవస్ధ అత్యంత దారుణంగా మారిపోయింది, దీంతో తిరిగి రీ పేమెంట్లు చెల్లించలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు… దీంతో మారిటోరియం మూడు నెలలు ఇచ్చింది ఆర్బీఐ, తాజాగా వడ్డీరేట్లపై ఆర్బీఐ మరోసారి కీలక ప్రకటన చేసింది.
లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు 20 లక్షల కోట్ల ప్యాకేజీ తర్వాత ఈ రోజు రెపో రేటు 40బేసిక్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు.ఇక రుణాలపై మరో మూడు నెలలు మారిటోరియం ఇస్తున్నట్లు తెలిపారు.
దీంతో మొత్తం ఆరు నెలలు మారిటోరియం విధించినట్లు అయింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు SIDBIకి మారటోరియం పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. టర్మ్ లోన్లకు వర్తించేలా మారటోరియం పొడిగింపు ఉంటుందని శక్తికాంత్ దాస్ అన్నారు.