తెలంగాణ లో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణ లో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్

0
147
AP Inter exams Schedule

తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల చేశారు అధికారులు…హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌తో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జూన్ 8 నుంచి జరుగ‌నున్నాయి.. జూన్‌ 8వ తేదీ నుంచి ప‌రీక్ష నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇక ప్ర‌తీ ప‌రీక్ష‌కు రెండు రోజులు గ్యాప్ ఇచ్చారు.

ఇక మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, ఉద‌యం ప‌రీక్షకు వ‌చ్చే స‌మ‌యంలో శానిటేజ‌ర్ వాడాలి, ఇక ప్ర‌తీ బెంచ్ కు ఒక్క‌రు మాత్ర‌మే విద్యార్ది ప‌రీక్ష రాస్తారు. 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.

ప‌రీక్ష‌ల షెడ్యూల్..
జూన్‌ 8న ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌
జూన్‌ 11న ఇంగ్లీష్‌ రెండో పేపర్‌
జూన్‌ 14న గణితము మొదటి పేపర్‌
జూన్‌ 17న గణితము రెండో పేపర్‌
జూన్‌ 20న సైన్స్‌(భౌతిక శాస్త్రం) మొదటి పేపర్‌
జూన్‌ 23న సైన్స్‌(జీవశాస్త్రం) రెండో పేపర్‌
జూన్‌ 26న సోషల్‌ స్టడీస్‌ మొదటి పేపర్‌
జూన్‌ 29న సోషల్‌ స్టడీస్‌ రెండో పేపర్‌
జులై 2న ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌(సంస్కృతం మరియు అరబిక్‌)
జులై 5న ఒకేషనల్‌ కోర్సు(థియరీ)