మన ప్రపంచం అంతా వైరస్ తో ఇబ్బందిపడుతోంది, దాదాపు 210 దేశాల్లో వైరస్ పాకేసింది, దీంతో ప్రతీ ఒక్కరు సఫర్ అవుతున్నారు, దాదాపు సగం దేశాలు లాక్ డౌన్ లోనే ఉన్నాయి. ఇక ప్రజారవాణా కూడా చాలా ప్రాంతాల్లో పూర్తిగా బంద్ అయింది, ఇక ప్రపంచంలో 52 లక్షల కేసులు ఉన్నాయి, ఇక మన దేశంలో ఏకంగా 1.10 లక్షల కేసులు నమోదు అయ్యాయి.
ఈ సమయంలో అందరూ భయంతో ఉన్నారు, అయితే అమెరికా యూరప్ దేశాలు అత్యంత దారుణంగా కనివిని ఎరుగని ప్రాణ నష్టాన్ని చూశాయి, ఇంకా వేలాది కేసులు ఆయా దేశాల్లో పెరుగుతున్నాయి, దీంతో వ్యాక్సిన్ వచ్చే వరకూ ఎవరూ ఏమీ చేయలేని స్దితి.
అయితే ఇన్ని దేశాల్లో ఈ వైరస్ పాకేసింది కాని కొన్ని ప్రాంతాలను దేశాలను అసలు తాకలేదు.. అక్కడ ఒక్క కేసు కూడా లేదు.. మరి ఆ దేశాలు చూస్తే..కిరిబాటి మార్షల్ దీవులు మైక్రోనేషియా నౌరు ఉత్తర కొరియా పలావు సమోవ సోలమన్ దీవులు టోన్గా తుర్క్మొనిస్తాన్ తువాలు వనౌటులలో కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు, అందుకే అక్కడకు వేరే దేశాల నుంచి ఎవరిని రానివ్వడం లేదు.