విషాదం- పాకిస్తాన్ లో కూలిన విమానం పైలట్ చివరి మాటలు ఇవే

విషాదం- పాకిస్తాన్ లో కూలిన విమానం పైలట్ చివరి మాటలు ఇవే

0
96

నిన్న పాకిస్తాన్ లో దారుణమైన ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మరి కొన్ని నిమిషాల సమయంలో పీఐఏకు చెందిన ఏ-320 విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనగా నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఏకంగా 99 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు, అయితే ఈ విమానానికి సంబంధించి సీసీటీవీ పుటేజ్ ఒకటి వెలుగు చూసింది.

ఇక చివరి నిమిషాల్లో విమానంలోని పైలట్ ఏటీసీతో మాట్లాడిన ఆడియో కూడా బయటకు వచ్చింది. రెండు ఇంజిన్లు కోల్పోయామంటూ ఏటీసీతో పైలట్ చెప్పిన సంభాషణలు కూడా అందులో వినిపిస్తున్నాయి. ఇక విమానం అత్యంత దారుణమైన ప్రమాద స్దితిలో ఉంది అని చెప్పే సమయంలో కోడ్ వాడతారు.

ఇక్కడ అదే చెప్పాడు పైలట్.. మేడే మేడే మేడే అని పైలట్ చెప్పడం కూడా వినిపించింది.
ఈ విమానం జిన్నా గార్డెన్ ప్రాంతంలోని మోడల్ కాలనీలో ఉన్న ఓ టెలిఫోన్ టవర్ను ఢీకొట్టిందని ఆ తర్వాత ఓ ఇంటిపై కూలిందని చెప్పారు. పాక్ లో వారం అయింది విమానాలు ప్రారంభించి , ఈ సమయంలో ఇలా ప్రమాదం జరగడంతో అందరూ షాక్ అయ్యారు.