కొందరు చేసే పనులు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి, ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది, ఏకంగా అరచేయిని నరుక్కుని దానిని కవర్లో కట్టుకున్నాడు ఓ యువకుడు, దానిని పట్టుకుని ఊరంతా తిరిగాడు.. ఈ దారుణమైన ఘటన ఒడిశాలో జరిగింది.
రక్తం కారుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా అలాగే రోడ్డుపైకి వచ్చాడు. గంజాం జిల్లా దిగపొహండి వద్ద చోటు చేసుకుంది ఈ ఘటన. దీంతో అతన్ని చూసిన గ్రామస్తులంతా వణికిపోయారు. ఇలా చేసిన ఆ యువకుడి గురించి వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు..
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు, అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు..ఆ యువకుడి మానసిక పరిస్థితి బాగోలేదని అందుకే అలా చేసి ఉంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. అతని వయసు 20 ఏళ్లు.