మన దేశంలో లాక్ డౌన్ అమలు చేయకపోతే ఇదే జరిగేదట

మన దేశంలో లాక్ డౌన్ అమలు చేయకపోతే ఇదే జరిగేదట

0
91

ప్రపంచం అంతా ఈ లాక్ డౌన్ తో ఇబ్బందుల్లో ఉంది, అయితే కొన్ని దేశాలు లాక్ డౌన్ అమలు చేశాయి, మరికొన్ని దేశాలు లాక్ డౌన్ పూర్తి చేసుకున్నాయి, మళ్లీ సాధారణ పరిస్దితికి వచ్చేశారు, అయితే చైనా అమెరికా బ్రిటన్ ఇలా అన్నీ దేశాలు కూడా లాక్ డౌన్ ముందు అమలు చేశాయి, తర్వాత సడలింపులు
ఇచ్చాయి.

ఇక భారత్ కూడా లాక్ డౌన్ రెండు నెలలుగా అమలు చేస్తోంది, మన దేశంలో పూర్తిగా లాక్ డౌన్ మే 31 వరకూ నాలగవ దశ అమలు అవుతుంది, అయితే ఈ లాక్ డౌన్తో లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ అన్నీ సులభతరం చేస్తున్నారు.

ఒకవేళ ఇండియాలో లాక్ డౌన్ పెట్టకపోయి ఉంటే.. కేసుల సంఖ్య 14 లక్షల నుంచి 29 లక్షల వరకూ ఉండేదట.37 వేల నుంచి 78 వేల మంది వరకూ చనిపోయి ఉండేవారట. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఈ లాక్ డౌన్ అమలు చేయడం వల్ల చాలా మందిని సేవ్ చేసింది మన ప్రభుత్వం.