ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మాస్ సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అనేది తెలిసిందే, బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి సినిమాలు, పలువురు అగ్రహీరోలతో ఆయన సినిమాలు తీశారు,అయితే తాజాగా ఆయన విజయ్ దేవరకొండతో తెలుగు, హిందీ భాషల్లో యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు, ఇది భారీగా నిర్మాణం జరుగుతోంది.
ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతున్న సమయంలో ఒక్కసారిగా లాక్ డౌన్ పెట్టడంతో దేశంలో ఎక్కడా షూటింగులకి అనుమతి లేదు, దీంతో చిత్ర షూటింగ్ రెండు నెలలుగా ఆగిపోయింది, అయితే ఈ సమయంలో తన నెక్ట్స్ చిత్రానికి కధ రెడీ చేస్తున్నారట దర్శకుడు పూరీ.
ఈ సినిమాని హీరో నందమూరి బాలకృష్ణతో పూరి చేయనున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణకు కథను చెప్పడం, ఆయన ఓకే చేసేయడం జరిగిపోయాయని అంటున్నారు. గతంలో బాలయ్యతో కలిసి పూరీ పైసా వసూల్ చిత్రం చేశారు, ఇప్పుడు మరో సినిమా చేయనున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.