సర్పంచ్ కు సీఎం కేసీఆర్ ఫోన్ – లక్కీ పర్సెన్ ఏమన్నారంటే

సర్పంచ్ కు సీఎం కేసీఆర్ ఫోన్ - లక్కీ పర్సెన్ ఏమన్నారంటే

0
81

సీఎం కేసీఆర్ ఒక్కోసారి ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు, ఆయన చర్యలు అలాగే ఉంటాయి, తాజాగా ఆయన ఈ లాక్ డౌన్ వేళ ప్రజలు అందరికి మీడియా ముఖంగా పలు విషయాలు తెలియచేస్తున్నారు. అయితే తాజాగా ఓ సర్పంచ్ కు ఫోన్ చేశారు సీఎం కేసీఆర్..

నేరుగా ముఖ్యమంత్రి నుంచి ఫోన్ కాల్ రావటంతో ఆ సర్పంచ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
సర్పంచ్ అశోక్ బాగున్నావా అని అడిగారు, ఇంతకీ ఆయనది సిద్దిపేట జిల్లా మర్కుక్ గ్రామం, అక్కడ సర్పంచ్ గా అశోక్ ఉన్నారు, మరి ఆయనకు ఎందుకు కేసీఆర్ కాల్ చేశారు అంటే.

ఆ గ్రామ పరిధిలోనే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ఉంది.దాన్ని త్వరలోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేరుగా దానిని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ అక్కడకు రానున్నారట, ఇదే విషయం సర్పంచ్ కు చెప్పారు, త్వరలోనే దాన్ని ప్రారంభిద్దాం. నీళ్లతో నింపుకుందాం.. మర్కుక్ లో పండుగ చేసుకుందాం అని కేసీఆర్ అన్నారు.. ఈ సమయంలో ఇంకా ఏమైనా గ్రామానికి కావాలా అని అడిగారు కేసీఆర్ ,

అయితే గ్రామ పంచాయితీ భవనం లేదన్న మాటకు స్పందిస్తూ.. ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజునే గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి భూమిపూజ చేద్దాం అని అన్నారు, దీంతో ఆ సర్పంచ్ చాలా ఆనందంలో ఉన్నారు.